ekkado manasu vellipoyindiఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది ఆహాహా.. ఓహోహో… నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2) అక్కడే చిక్కుకుపోయానంటుంది బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో|| జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2) దేనికీ ఇక చోటే లేదంది యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో|| ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2) అక్కడే కరిగిపోతానంటుంది ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||