chiru divvela velugulathoచిరు దివ్వెల వెలుగులతో
చిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో నను బ్రోవ రావయ్యా కంటి పాపలా.. నను కాన రావయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. (2) నను బ్రోవ రావయ్యా నను కాన రావయ్యా (2) ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2) దహించివేస్తున్న అవమానము కరువైపోయిన సమాధానము (2) పగిలిన హృదయము కన్నీటి ధారల సంద్రము (2) ఎగసి పడుతున్న కెరటము కానరాని గమ్యము (2) ||చిరు|| ఏకమైన ఈ లోకము వేధిస్తున్న విరోధము దూరమవుతున్న బంధము తాళలేను ఈ నరకము (2) ఈదలేని ప్రవాహము చేరువైన అగాధము (4) ||చిరు||