paapakoopamunmdhu padi munigiyపాపకూపమునందు పడి మునిగియున్నావ
పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది యెందుకు
పాప జన్మము పాపకర్మము పాపపూరితమైన హృదయము ఓపరాని
భయంకరోగ్రత శాపములు సమకట్టియుండగ ||పాప||
1. పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు
నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము
లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు ||పాప||
2. కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు
ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు
వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను ||పాప||
3. పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే
పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య
లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె ||పాప||
4. పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ
పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని
స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు ||పాప||
5. పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని
దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి
కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే ||పాప||
6. శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు
వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు
నీకిడఁగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె ||పాప||
paapakoopamunMdhu padi munigiyunnaavu paatiMpavadhi yeMdhuku
paapa janmamu paapakarmamu paapapoorithamaina hrudhayamu oaparaani
bhayMkaroagratha shaapamulu samakattiyuMdaga ||paapa||
1. paramaathma meedhanae guri nilpu mani dhelpu varaboaDhamadhi neMchavu
niratha munu raathriyunu bavalunu niravu Dhanamunu ghanamu saukhyamu
larayu chuMdhuvu kShNamu neevaa parama Dharmamu sarakujaeyavu ||paapa||
2. kanivinMga nudhagani panikimaalina kriyala dhanisi bhramayuchu nuMdhuvu
ghanula pedhdhala jananeejanakula nanishamunu nirasiMchi melagedu
vinayarahithMbaina jeevitha munaku naemi ghatillunoakanu ||paapa||
3. peravaaralanu briyasoa dharuluga braemiMpa paramaathmapurikolpadhae
parulapai dhvaeShMbu pagagoni palutherMgula baaDhapaRachuchu praaNahathya
lonarchu neeku parama padhamu labhiMpasaaDhyame ||paapa||
4. paapa parihaaraarTha praayashchiththamu jaesi praaNamarpiMche nevaroa aa
paraathparu naashrayiMchumu shaapabhaaramu baapibroachunu maapu raepunulaeni
svarga praapthikalgunu nithyashubhamagu ||paapa||
5. paapabhaaramu kriMdha padikuMdhu meekunae paraganiththunu shaaMthini
dhaapu naku rMdMchu pathithula dhayanu bilachedu yaesukreesthunu paapi
kaashrayudMchu nammi bhakthithoa praarThiMchi vaedavae ||paapa||
6. sharaNeeya varamoakSh puramMdhu ghanasaukhya paramaanMdhamu loMdhuchu
varula dhoothala bhakthagaNamula sarasadhaevu smariMchu bhaagyamu gurudu
neekidAOgoari piluchuchu karamu jaapenu kaugiliMpave ||paapa||