daya choopumayaa ee dhaatripaina దయ చూపుమయా ఈ ధాత్రిపైన
దయ చూపుమయా – ఈ ధాత్రిపైన
కృప చూపుమయా – మానవాళిపైన
తెలియని తెగులేదో – మము తరుముచున్నది
నీవు ఊదిన ఊపిరే – బహు భారమైనది
మరణభయముతో – మేము దాగివుంటిమి
ఆశగా నీ కృపకై – మే వేడుచుంటిమి
యేసయ్య కరుణించుమయా
ఎల్షదయ్ విడిపించుమయా
మా ఙ్ఞానం విఙ్ఞానం వ్యర్ధమైనది
మా బలము బలగము నిర్వీర్యమైనది
కేవలము నీకే నీకే విరోధముగా
పాపము చేసి నశియించుచున్నాము
యేసయ్య ఓ మెస్సయ్య కరుణించుమయా
యేసయ్య ఓ మెస్సయ్య రక్షించుమయా
నీ ప్రేమ వాత్సల్యం అలసత్వం చేసి
ఈ లోక లౌక్యంలో మునిగిపోతిమి
వీడితిమి నీదు జీవ మార్గమును
మరణాంధకారం మము కమ్ముచున్నది
యేసయ్య ఓ మెస్సయ్య దయచూపుమయా
యేసయ్య ఓ మెస్సయ్య రక్షించుమయా