manasunu munchetthe ee soundaryam మనసును ముంచెత్తె ఈ సౌందర్యం
మనసును ముంచెత్తె ఈ సౌందర్యం
కనులను మురిపించే నీ కార్యం
నీ నోటితో మాటతోనే
చేసినావే అద్భుతం
ఇష్టమొంది సృష్టినంతా
సృష్టించావు నీవయా…
యేసయ్యా నీ ప్రేమే అమరం
యేసయ్యా నీ ప్రేమే మధురం
యేసయ్యా నీ ప్రేమే పదిలం
చాలిలలో నాకు…!!
నువ్వే రాకుంటే నా కోసం
వేరేలా ఉండే నాలోకం
నా జీవితం గతిలేక
పాపమందే దుర్భరం
నీకు నీవే సిల్వయాగం
చేసినవే నా ప్రభూ…
యేసయ్యా నీ ప్రేమే అమరం
యేసయ్యా నీ ప్రేమే మధురం
యేసయ్యా నీ ప్రేమే పదిలం
చాలిలలో నాకు…!!
నీటిలో నీ కార్యము
ప్రతివాటిలో నీ కృత్యము
వెలుగులో నీ రూపము
ఈ గాలిలో నీ ప్రభావము
ప్రకృతే ప్రమోదము
ఈ సృష్టియే అమోఘము
వీటిలో నీ ప్రేమను
నే చూచినానాయా…