jyoathiga mamu jaeyumoa dhaevaజ్యోతిగ మము జేయుమో దేవా యీ లోక
జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో
దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి
ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||
1. మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును
శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు
జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా ||జ్యోతిగ||
2. సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి
జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార
దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||
3. నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు
కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప
మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ ||జ్యోతిగ||
4. సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే
యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర
త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||
jyoathiga mamu jaeyumoa dhaevaa yee loakamuna nee khyaathi nilupaga jaeyumoa
dhaevaa jyoathiga mamu jaesi maaloa kreesthu maargamu bayalu parachi neethi
praemalathoada hrudhayamu niMpi mamunadipiMpu mayyaa ||jyoathiga||
1. maa kutuMbamu loana nee velugu prasariMchu natluga naadhu bradhukunu
shudhDhi jaeyumayyaa maa kutuMbamuloani vaaralu maanakanu nee velugu
joopaga mammu nee maargMbunMdhuna manupa parishudhDhaathma nidumaa ||jyoathiga||
2. sMghamuna nee keerthi kanapadaga parishudhDha sahavaasMbuloa nanu vrudhDhi
jaeyu mayaa bhMgaparachedi kakShlanniti baaDhaparachedi shakthulanniti paara
dhoalaga shakthinidi nee bhakthi kaaMthini joopi naaloa ||jyoathiga||
3. ninnu dheliyani yaathma lennennoa maa chuttununnavi nee koraku
kanipettuchunnavayaa annivaeLala nee suvaarthanu aMdhariki prakatiMpa
manasuna naashanidi nee vaartha velugunu anni dhishalaku jaatunatluga ||jyoathiga||
4. samayamunu varamula nosMgithivi maa rakShkaa Dhana sMpadhanu neevae
yosMgithivi vimala jeevithamMdhu vaanini virivigaa nitharula kosMgi veera
thyaagaarpaNamulathoa nee velugu prasariMpMgajaeyanu ||jyoathiga||