baalakula vinnapamu laalimchu బాలకుల విన్నపము లాలించు రక్షకా
Chords: ragam: కురంజి-kurMji
బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ
పోషకా||
1. బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ
బ్రోవుమా||
2. మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా
యందు జూపుమా||
3. చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ
మరువనీకుమీ||
4. ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు
మఖిలకాలము||
5. పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ
జేర గరుణజూపుము ||