అందుకొనుమా స్వాగతం
అందుకొనుమా స్వాగతం ౹౹2౹౹
నిత్య నూతన రాజ్యాధినేత
శాశ్వత జీవ మోక్ష ప్రదాత ౹౹ అందుకొనుమా౹౹
నిరాధార ఆకాశన అందమైన ఆ వెలుగు
అబ్బురముగేల నిలిచెనో
పీఠం లేని గగనాన దూత కోటి నిలిచి
గానము ఏల చేసేనో
అంబరాన అద్భుతాలే శూన్యంలో సోయగాలే
వింతగొల్పు నీదు జన్మ
దేవునికసాధ్యము ఏదియు లేదని
ఋజువాయే నేటితో
అపవాది క్రియలకు అనంత నాశనం
రక్షణ అస్త్ర ధారి నిరీక్షణ నీవే మరి
నీపాటి లేరు సరి
