• waytochurch.com logo
Song # 30333

కరములే కరములు యేసయ్యా


కరములే కరములు యేసయ్యా | Karamele Karamulu Yesayya | Telugu Christian Song | Pas Roshan Kumar | Music: JS Ranjith Kumar


🙏 కరములే కరములు✝️ యేసయ్యా – కృపగల కరములు
మనలను సృష్టించిన చేతులు, మనలను రక్షించిన చేతులు, సిలువలో మేకులు కొట్టించుకున్న చేతులు – అవే మన జీవితానికి ఆధారం, ఆశ్రయం. ఈ ఆత్మీయ గీతం ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని ప్రార్థిస్తున్నాము.


మీరు ఈ పాట ద్వారా ఆశీర్వదింపబడితే



కరములే కరములు యేసయ్యా కృపగల కరములు
నా జీవితానికి ఆధారము నా జీవితానికి ఆశ్రయము
కరములే కరములు యేసయ్యా కరుణగల కరములు
నీ కరములే నను సృష్టించే – నీ కరములే నను రక్షించే

మరణ పడకలో ఉన్నప్పుడు
కృపతో నిలిపెను నీ కరములు ప్రభు
ఎవ్వరు హామీ యివ్వలేదే
నను ఆదుకొనెను నీ కరములు ప్రభు
నను ఆదరించే నీ కరములు ॥కరములే॥

వీధులలో కాడిని మోసి
చీరుకుపోయెను నీ కరములు ప్రభు
కాడిని నన్ను మోయనియ్యక
నీవే కాడిని మోసితివా ప్రభు
నాకై కాడిని మోసితివా ॥కరములే॥

ఓపిక లేక సొమ్మసిల్లిన
చేతులు నాకై చాపితివా ప్రభు
మేకులు కొట్టిర అరచేతులలో
బలియై పోతివ నా కోసము ప్రభు
బలియాగమైతివ నా కోసమే ॥కరములే॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com