raare choothumu raajasuthudee రారె చూతుము రాజసుతుడీ రేయి జనన
Chords: ragam: హిందుస్థాని తోడి-hiMdhusThaani thoadi
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా
రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
1. దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే
మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||
2. కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె
తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||
3. బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా
బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||
4. యూద వంశము ను ద్ధరింప దా వీదుపురమున నుద్భవించె
సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||