yehoavaa nee yokka maata choppunయెహోవా నీ యొక్క మాట చొప్పున
Reference: నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తన Psalm 119:65-72పల్లవి: యెహోవా నీ యొక్క మాట చొప్పున నీ దాసునికి మేలు చేసియున్నావు1. మంచి వివేచన మంచి జ్ఞానమునకు - కర్త నీవే నాకు బోధ చేయుమునీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని 2. నాకు శ్రమ కలుగక మునుపు - నా దేవా నేను త్రోవ వీడితినినేడు నీ మాట నెరవేర్చు చున్నాను3. దేవా నీవు దయగలవాడవు - దేవా నీవు మేలు చేయుచున్నావునీ కట్టడల నాకు బోధించుము4. గర్విష్ఠులు నాకు విరోధముగా - కల్పించుదురెన్నో అబద్ధములునీ యుపదేశము లనుసరింతును5. వారి హృదయములు క్రొవ్వువలె - చాల మందముగానై యున్నవిఆజ్ఞలలో ఆనందించుచున్నాను6. దేవా నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లు శ్రమల నొందియుండుట నాకు యెంతో మేలాయెను7. వేలాది వెండి నాణెముల కంటె - వేలాది బంగారు నాణెముల కంటెనీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు
Reference: naenu nee aajnYlayMdhu nammika yuMchiyunnaanu. mMchi vivaechana mMchi jnYaanamu naaku naerpumu. shramakalugaka munupu naenu throava vidichithini. ippudu nee vaakyamu nanusariMchi naduchukonuchunnaanu. keerthana Psalm 119:65-72Chorus: yehoavaa nee yokka maata choppun nee dhaasuniki maelu chaesiyunnaavu1. mMchi vivaechana mMchi jnYaanamunaku - kartha neevae naaku boaDha chaeyumunee yaajnYlMdhu nammika nuMchithini 2. naaku shrama kalugaka munupu - naa dhaevaa naenu throava veedithininaedu nee maata neravaerchu chunnaanu3. dhaevaa neevu dhayagalavaadavu - dhaevaa neevu maelu chaeyuchunnaavunee kattadala naaku boaDhiMchumu4. garviShTulu naaku viroaDhamugaa - kalpiMchudhurennoa abadhDhamulunee yupadhaeshamu lanusariMthunu5. vaari hrudhayamulu krovvuvale - chaala mMdhamugaanai yunnaviaajnYlaloa aanMdhiMchuchunnaanu6. dhaevaa naenu nee kattadalanu - naerchukonunatlu shramala noMdhiyuMduta naaku yeMthoa maelaayenu7. vaelaadhi veMdi naaNemula kMte - vaelaadhi bMgaaru naaNemula kMtenee vichchina aajnYlu naaku maelu