• waytochurch.com logo
Song # 3266

sarvoannatha sthalmbuloa dhaevunikae mahimసర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ



Reference: మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ప్రకటన Revelation 22:1-2

Reference: చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను. లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను. యెషయా Isaiah 41:19

పల్లవి: సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమ
సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను

అను పల్లవి: సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియు
సర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము

1. పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబు
మురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెను
పరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండు
ప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె

2. దేవుని సింహాసనమున - దేవుని మహిమలో
సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల
జీవుల మద్యనుండెను - దేవుని గొర్రెపిల్ల
ఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే

3. స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనది
పట్టణపు వీదులలో - ప్రవహించుచుండెను
స్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవౄక్షంబు
స్వస్థత కలిగించును - వౄక్షంపు యాకులు

4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్
మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్
బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకు
నిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్

5. మెట్టల స్థలమందున - నదుల పారచేతున్
ఈటల నెన్నో లోయల - నుబుకంగ జేతును
నీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటిని
నీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను

6. దావీదు పట్టణమందున - దావీదు సంతతిలో
దేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండు
దావీదు తాళము కలిగి - తన సింహాసనమందు
తావిచ్చి చేర్చుకొనును - జయించువారిని

7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు
విలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్
బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధిని
బలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము



Reference: mariyu sphatikamuvale merayunatti jeevajalamula nadhi dhaevuni yokkayu goRRapilla yokkayu siMhaasanamunodhdhanuMdi aa pattaNapu raajaveeDhi maDhyanu pravahiMchuta aa dhootha naaku choopenu. aa nadhi yokka eevalanu aavalanu jeevavrukShmuMdenu; adhi nelanelaku phaliMchuchu pMdreMdu kaapulu kaayunu. aa vrukShmu yokka aakulu janamulanu svasThaparachutakai viniyoagiMchunu. prakatana Revelation 22:1-2

Reference: chetlulaeni mettalameedha naenu nadhulanu paarajaesedhanu. loayalamaDhyanu ootalanu ubukajaesedhanu. araNyamunu neetimadugugaanu eMdina naelanu neetibuggalugaanu chaesedhanu. yeShyaa Isaiah 41:19

Chorus: sarvoannatha sThalMbuloa - dhaevunikae mahim
sarvaaDhikaari yaesuni siluvachae kaligenu

Chorus-2: sarvoannathuMdagu dhaevuni - saevakulai yuMdiyu
sarvoannathuni chiththMbuna - sarvadhaa sthuthiyiMchedhamu

1. paraloaka yerooShlaemuna - parishudhDhula sMghMbu
muriyuchu bhartha yaesukai - arudheMchuchuMdenu
parishudhDha pattaNamMdhuna - prabhu yaesu kreesthuMdu
prakaashamaanadheepamai - prajvaliMchuchu nuMde

2. dhaevuni siMhaasanamuna - dhaevuni mahimaloa
suvarNa kireetMbula DhariMchina pedhdhal
jeevula madhyanuMdenu - dhaevuni gorrepill
ghanatha mahima prabhaavamu - yugayugamulu aayanakae

3. sphatikMbu boalinatti merayu - jeeva jalanadhi
pattaNapu veedhulaloa - pravahiMchuchuMdenu
sphatikMpu nadhi kiruprakkala - jeeva phalavroakShMbu
svasThatha kaligiMchunu - vroakShMpu yaakulu

4. bMdaloa nuMdi neetikaalvala niMduga rappiMchen
meMdaina nadhula neeLLanu - dhMdiga paariMchen
bMdaina kreesthunu cheelchenu - prabhudhaevuMdae manaku
niMdaara niMpu naathmanu - thMdri viDhaeyulan

5. mettala sThalamMdhuna - nadhula paarachaethun
eetala nennoa loayala - nubukMga jaethunu
neetimadugulugaa maarchedha - naraNyamu nMthatini
neeti buggalugaa chaethunu - eMdina naelanu

6. dhaaveedhu pattaNamMdhuna - dhaaveedhu sMthathiloa
dhaevuni sarvashakthithoa - janmiMche yaesuMdu
dhaaveedhu thaaLamu kaligi - thana siMhaasanamMdhu
thaavichchi chaerchukonunu - jayiMchuvaarini

7. silvaloa maraNiMchenu shree yaesu naa koraku
viluvaina rakthamu kaarchenu - malinMbu boagottan
baludaina aathma shakthithoa - geliche samaaDhini
balamichchunu parishudhDhulaku - hallelooyaa paadedhamu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com