• waytochurch.com logo
Song # 3328

prabhuyaesu naakai sarvamu nichchithivi praemanubatti arpimchu komtivi naakaiప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై



Reference: నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ Galatians 2:20

పల్లవి: ప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై

1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ

2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి
కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి

3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను
శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా

4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి

5. ప్రాయశ్చింత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు
పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను

6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి

7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు
నీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి



Reference: naenippudu shareeramMdhu jeeviMchuchunna jeevithamu nannu praemiMchi, naakoraku thannu thaanu appagiMchukonina dhaevuni kumaaruni yMdhali vishvaasamu valana jeeviMchuchunnaanu. galathee Galatians 2:20

Chorus: prabhuyaesu naakai sarvamu nichchithivi
praemanubatti arpiMchu koMtivi naakai

1. shirassu nichchithivi muMdla makutamukai - svaami naa paapamula korakae
sahiMpajaalani vaedhana bahugaa sahiMchithivi praemathoad

2. kannula nichchithivi kanneeru kaarcha - karuNiMchi naa sThithini joochi
karige nee hrudhayM dhuHkhMbuthoada - kadu vaedhanathoa yaedchithivi

3. koradaa dhebbalachae nee dhaehamMtha - chaaraluga dhunnabadenu
shareeramMtha rakthamayamaayenu - varadhaa! gaayamu loMdhithivaa

4. kaaLLu chaethulaloa maekulu gottiri - ballemuthoa prakkan bodichiri
yaelaagu vivariMthu nee baaDha naenu - oarchithivaa maunamu vahiMchi

5. praayashchiMththMbai poathivaa naakai - paapamu nuMdi vidipiMchutaku
poMdhithi neMthoa goppa rakShNanu - pashchaaththaapamu dhvaaraa naenu

6. eMtha adhbhuthamu prabhuvaa nee praema - eMdhu kiMthagaa praemiMchithivi
vMdhana marpiMthu nee paadhamulakae - poMdhuga nee vaadanaithi

7. naa yedala needhu sMkalpamaegaa - nee svaasThya manubhaviMchutaku
neethoada nirathM naenuMdunatlu nee yaDhikaarM bichchithivi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com