udhayimche dhivya rakshkudu ghoaraamdhakaara loakamunఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
Reference: దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11
పల్లవి: ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను - 2
1. ఘోరాంధకారమున దీపంబులేక - పలుమారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా
మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి
దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో
2. చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా - ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను
3. పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్
లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు
చీకటినుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు
Reference: dhaaveedhu pattaNamMdhu naedu rakShkudu meekoraku puttiyunnaadu; eeyana prabhuvaina kreesthu. lookaa 2:11
Chorus: udhayiMche dhivya rakShkudu ghoaraaMDhakaara loakamun
mahima kreesthu udhayiMchenu rakShNa veluguniyyanu - 2
1. ghoaraaMDhakaaramuna dheepMbulaeka - palumaaru paduchuMdagaa
dhuHkha niraasha yaathrikulMthaa - dhaarithappiyuMdagaa
maargadharshiyai nadipiMchuvaarin - prabhupaadha sanniDhiki
dhivyarakShkudu prakaasha velugu - udhayiMche ee Dharaloa
2. chiMthavichaaramuthoa niMdiyunna - loakaroadhanavini
paapMbunuMdi nashiMchipoagaa - aathmavimoachakudu
maanavaaLikai maraNMbunoMdhi - nithya jeevamu nivvan
dhivyarakShkudu prakaashathaara - udhayiMche rakShiMpanu
3. paraloaka thMdri karuNiMchi manala - pMpenu kreesthuprabhun
loakaaMDhulaku dhruShti nivva - arudheMche kreesthu prabhuvu
cheekatinuMdi dhaiva velugunaku - thechche kreesthu prabhuvu
saathaanu shruMkhalamulanu theMpa - udhayiMche rakShkudu