• waytochurch.com logo
Song # 3759

unnatha dhurgamu naa dhaevudae naa rakshkudae naakaashrayuduఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నాకాశ్రయుడు



Reference: యెహోవా నా ఉన్నత దుర్గము కీర్తన Psalm 18:2

పల్లవి: ఉన్నత దుర్గము - నా దేవుడే
నా రక్షకుడే - నాకాశ్రయుడు

1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది
అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే
ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది

2. నా కోటయు నాశైలము ఆయనే
నాకేడెము రక్షణ శృంగమును
ఉన్నతమగు దేవుడే - నాకా శ్రయ దుర్గము

3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు
రత్నవర్ణుడు - నాకతి ప్రియుడు
పదివేల మందిలో - అతని గుర్తించెదను

4. నిత్యజీవము - మెండుగ నొసగి
పరమాహారము - తృప్తిగ నిచ్చె
నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము

5. విజయ గీతము - పాడెద ప్రభుకే
విజయము నిచ్చెను - శత్రువుపైన
ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము

6. మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు
ఇహకేతెంచును - నాకై త్వరలో
హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును



Reference: yehoavaa naa unnatha dhurgamu keerthana Psalm 18:2

Chorus: unnatha dhurgamu - naa dhaevudae
naa rakShkudae - naakaashrayudu

1. yehoavaa mahaathmyamu - eMthoa goppadhi
aDhika sthoathramulaku - paathruMdaayanae
aa prabhu aishvaryamu - grahiMpashakyamu kaanidhi

2. naa koatayu naashailamu aayanae
naakaedemu rakShNa shruMgamunu
unnathamagu dhaevudae - naakaa shraya dhurgamu

3. naa priya prabhuvu - dhavaLavarNudu
rathnavarNudu - naakathi priyudu
padhivaela mMdhiloa - athani gurthiMchedhanu

4. nithyajeevamu - meMduga nosagi
paramaahaaramu - thrupthiga nichche
nirathamu thana krupathoa - nilupukonenu sthoathramu

5. vijaya geethamu - paadedha prabhukae
vijayamu nichchenu - shathruvupain
unnatha dhurgamupai nekkiMchenu sthoathramu

6. mahima poorNudu - naa prabhuyaesu
ihakaetheMchunu - naakai thvaraloa
hallelooya sthoathramul - paadi praharShiMthunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com