• waytochurch.com logo
Song # 3994

loakm jeevm maranmbainan sakalamu maeve nijm sthiramuga nammudilanలోకం జీవం మరణంబైనన్ సకలము మేవె నిజం స్థిరముగ నమ్ముడిలన్



Reference: సమస్తమును మీవే 1 కొరింథీ Corinthians 3:22

పల్లవి: లోకం, జీవం, మరణంబైనన్
సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్

1. ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను
వాస్తవముగా సమస్తము మీవె - మీరేసుని వారు

2. తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో
కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు

3. హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు
పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును

4. అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము
రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు

5. అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును
యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు

6. మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు
వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు

7. జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా
ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు



Reference: samasthamunu meevae 1 koriMThee Corinthians 3:22

Chorus: loakM, jeevM, maraNMbainan
sakalamu meeve nijM - sThiramuga nammudilan

1. prasthuthamMdhu unnaviyainan - raaboavunattiviyainanu
vaasthavamugaa samasthamu meeve - meeraesuni vaaru

2. thannu praemiMchuchuMdedi vaariki - dhaevudu vaetini sidhdhaparachenoa
kannulaku goacharamu kaavavi - chevulaku vinabadavu

3. hrudhayamulaku agoacharamainavi - marugaiyuMde loakajnYaanulaku
padhilamugaa prabhu sahaayamuthoa - naerugu mee marmamunu

4. akShyamainadhi nirmalamainadhi - vaadabaaranidhi mee svaasThyamu
rakShkudaesu bhadhraparachenu - paramuna meekoraku

5. asamaanamagu shakthichae mimmun - nithyamukaachi bhadhraparachunu
yaesu aa kadavari rakShNa meeku - nichchu vishvasiMchu

6. meerae dhaevuni puthrulatMchu - aathmayae saakShmichchu chunnaadu
vaarasulagu meeru shramapadina - mahimanu poMdhedharu

7. jayiMchuvaadu veetannitini - svaathMthriMchukonu nikkamugaa
aayanae meeku dhaevudaiyuMdu - meeraayana suthulu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com