• waytochurch.com logo
Song # 6107

ఆరంభమయ్యింది ఆరంభమయ్యింది

arambamayindhi restoration Restoration


ఆరంభమయ్యింది Restoration
నా జీవితంలోన New sensation

నేను పొగొట్టుకున్నవన్ని నా మేలు కోసం,నా ప్రభువు సమకూర్చి దీవించులే!
మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!

హే!మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
కడవరి మందిర ఉనత మహిమే Restoration Restoration

హే!రెండంతలు,నాల్గంతలు,ఐదంతలు,
నూరంతలు,వెయ్యంతలు,ఊహలకు మించేటి

1.మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును
మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను
అరె!సాయంకాలమున ఏడ్పు వచినను ఉదయం కలుగు
నోట నువ్వు పుట్టును,మాకు వెలుగు కలుగును
ధు:ఖము ంట్టూర్పు ఎగగొట్టి ప్రభువు మమ్మాదరించును
కీదు తొలగజేయును,మేలు కలుగజేయును

2.మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును
చేడపురుగులెన్నియొ తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును
అరె!నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను
అది తప్పక జరుగును,కదవరి వర్షమొచ్చును
క్రొత్తద్రాక్షారసము,అహా!మంచి ధాన్యములతో మా కొట్లు నింపును
క్రొత్తతైలమిచ్చును,మా కొరత తీర్చును

3.పక్షిరాజు వలెను మా యౌవ్వనమును
ప్రభు నిత్యనూతనం చేయును
మేం కోల్పోయిన యౌవన దినములను
మరలా రెట్టింపుగా మాకిచ్చును
అరె!వంద ఏళ్ళూయినా,మా బలము ఉడగకుండా సారమిచ్చును
జీవ ఊటనిచ్చును,జీవ జలములిచ్చును
సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును
ఆత్మవాక్కులిచ్చును,మంచి దృష్టినిచ్చును

4.మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన
మా సొత్తు మాకు విడిపించును
మోసకారి మోసము మేము తిప్పికొట్టను
ఆత్మ జ్ఞానముతో మము నింపును
అరె!అంఢకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో
మమ్ము గొప్పజేయును,దొంగ దిమ్మ తిరుగును
దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును
మహిమ కుమ్మరించును,మెప్పు ఘనతలిచ్చును

5.మా జీవితాలలో దైవ చిత్తమంతయూ
మేము చేయునత్లు కృపనిచ్చును
సర్వలోకమతట సిలువ వార్త చాట్ను
గొప్ప ద్వారములు ప్రభు తెరచును
అరె!అపవాది క్రియలు మేం లయము చేయునట్ట్లు అభిషేకమిచ్చును
ఆత్మ రోషమిచ్చును,కొత్త ఊపు తెచ్చును
మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును
సత్యబోధనిచ్చును,రాజ్య మర్మమిచ్చును


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com